తగ్గని కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 10,167 కేసులు నమోదు
18:08 July 30
రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి తగ్గడంలేదు. 24 గంటల వ్యవధిలో 10,167 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో నిన్న ఒక్కరోజే 68 మంది మృతిచెందారు. మొత్తం బాధితుల సంఖ్య 1,30,557కు చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాలు 1,281కి చేరాయి. మొత్తం 63,771 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి 55,406 మంది బాధితులు కోలుకున్నారు.
తూర్పుగోదావరి, కర్నూలు, విశాఖ జిల్లాల్లో వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా 1,441 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్తగా 1,252, విశాఖ జిల్లాలో 1,223, పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తగా 998 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం జిల్లాలో కొత్తగా 954, గుంటూరు జిల్లాలో కొత్తగా 946 కరోనా కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది.
కడప జిల్లాలో కొత్తగా 753 కరోనా కేసులు నమోదు కాగా... నెల్లూరు జిల్లాలో కొత్తగా 702, శ్రీకాకుళం జిల్లాలో 586 కరోనా కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు జిల్లాలో కొత్తగా 509 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ప్రకాశం జిల్లాలో కొత్తగా 318 కరోనా కేసులు నమోదు కాగా... కృష్ణా జిల్లాలో కొత్తగా 271, విజయనగరం జిల్లాలో 214 కరోనా కేసులు నమోదు అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కొత్తగా 70,584 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 18.20 లక్షల నమూనాలు పరీక్ష చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది.