ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: కేసులు వెయ్యి.. చూసి అడుగెయ్యి! - coronavirus news

హైదరాబాద్​ వ్యాప్తంగా కొవిడ్​ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. నిన్న గ్రేటర్​ వ్యాప్తంగా 26 కేసులు బయటపడ్డాయి.లాక్‌డౌన్‌ నిబంధనలను మంగళవారం నుంచి మరింత సడలించడంతో ప్రజలు ఇంకాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

1000 CORONA CASES CROSSED IN HYDERABAD
హైదరాబాద్ లో వెయ్యి దాటిన కరోనా కేసులు

By

Published : May 19, 2020, 11:33 AM IST

గ్రేటర్‌ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. వెంటనే వైరస్‌ లక్షణాలు బయటపడకపోవడం కానీ, బయటపడినా భౌతిక దూరం పాటించకపోవడం కానీ, జాగ్రత్తలు చేపట్టకపోవడం వల్ల కానీ ఈ పరిస్థితి తలెత్తుతోందని అధికారులు భావిస్తున్నారు. సోమవారం గ్రేటర్‌ వ్యాప్తంగా 26 కేసులు భయటపడడమే ఈ పరిస్థితికి నిదర్శనం. లాక్‌డౌన్‌ నిబంధనలను మంగళవారం నుంచి మరింత సడలించడంతో ప్రజలు ఇంకాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మాస్క్‌లు ధరించడం...చేతి శుభ్రత పాటించపోతే వైరస్‌ ఉద్ధృతి మరింత పెరిగే ప్రమాదముంది.

కొవిడ్‌తో బ్యాంకు ఉద్యోగి కన్నుమూత

సుల్తాన్‌బజార్‌: కోఠిలోని ఓ బ్యాంకు ప్రధాన కార్యాలయంలోని కమర్షియల్‌ విభాగంలో పని చేసే ఉద్యోగి కరోనాతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. గత నెలలో ఆయన బావమరిది కుమారుడు గుండెపోటుతో చనిపోవడంతో జియాగూడకు వెళ్లి వచ్చినట్లు సమాచారం. ఈనెల 14న ఆయన కరోనా లక్షణాలతో బాధపడుతూ గాంధీ ఆసుపత్రిలో చేరారు. కామ్‌గార్‌నగర్‌లోని ఉద్యోగి కుటుంబ సభ్యులు 8 మందిని, అతను పనిచేసే బ్యాంకు శాఖ సిబ్బంది, ఇతరులు కలిపి 74 మందిని హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు. బ్యాంకు మొత్తాన్ని శానిటైజేషన్‌ చేయించారు.

మంగళ్‌హాట్‌లో మరో ఇద్దరికి

గోషామహల్‌: మంగళ్‌హాట్‌లో మరో ఇద్దరికి కరోనా నిర్ధారణైంది. శివలాల్‌నగర్‌లో 2 రోజుల క్రితం ఓ వృద్ధురాలికి కరోనా రావడంతో కుటుంబ సభ్యులను ఎర్రగడ్డలోని ప్రభుత్వ ప్రకృతి వైద్య ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. భోలక్‌పూర్‌లో గర్భిణికి సోకడంతో అప్రమత్తమైన వైద్యారోగ్య సిబ్బంది, సోమవారం ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులు 70 మందిని హోం క్వారంటైన్‌ చేశారు. శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డి కాలనీకి చెందిన వ్యక్తి(29)కి వైరస్‌ సోకింది.

ఒకే కుటుంబంలో 8 మందికి

మాదన్నపేట:కుర్మగూడ డివిజన్‌ కుర్మగూడలో ఒకే కుటుంబానికి చెందిన మరో 8 మందికి వైరస్‌ నిర్ధారించారు. మూడు రోజుల కిందట అదే ఇంట్లో వృద్ధుడి(78)కి పాజిటివ్‌ వచ్చింది. ఆ ప్రాంతంలో ఇంటింటి సర్వే చేపట్టేందుకు వెళ్లిన ఆశా కార్యకర్తలను బస్తీవాసులు అడ్డుకున్నారు. మాదన్నపేట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గోల్నాక అశోకనగర్‌లో ఓ మహిళకు(30) కరోనా సోకింది.

ఫీవరాసుపత్రికి 10 మంది అనుమానితులు

నల్లకుంట: పది మంది కరోనా అనుమానితులు నల్లకుంటలోని ఫీవరాసుపత్రిలో చేరారు. ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రి నుంచి సోమవారం ఒకరిని ‘గాంధీ’కి తరలించారు.

కార్వాన్‌ సర్కిల్‌లో మరో నలుగురికి..

జియాగూడ:కార్వాన్‌ సర్కిల్‌లో మరో నలుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. సబ్జిమండీలో ఓ వృద్ధుడికి, జియాగూడ కురుమబస్తీకి చెందిన నలుగురు గతంలో కొవిడ్‌19 బారిన పడగా వీరుంటున్న భవనంలోని మరో ముగ్గురికి తాజాగా సెకండరీ కాంటాక్ట్‌ ద్వారా వైరస్‌ వ్యాపించింది. కరోనా కలకలంతో పురానాపూల్‌లోని ఓ బ్యాంకు శాఖను మూసేశారు.

ఇదీ చదవండి : కరోనా వైరస్​ మన దుస్తులకు అంటుకుంటుందా?

ABOUT THE AUTHOR

...view details