గ్రామ పంచాయతీల్లో అక్టోబరు 2 నుంచి వంద రోజులపాటు స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాలు నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఇతర అధికారులను ఆదేశించారు. ఆరోగ్యవంతమైన గ్రామాలే లక్ష్యంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని అక్టోబరు 2న సీఎం ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి మంత్రి వీడియో సమావేశంలో పాల్గొన్నారు. వైఎస్‌ఆర్ ఆసరా రెండోవిడత కార్యక్రమాన్ని అక్టోబరు 7న సీఎం ప్రారంభిస్తారని పెద్దిరెడ్డి అన్నారు. పది రోజులపాటు మహిళలకు వ్యాపార అవకాశాలపై అవగాహన పెంచి, ఉపాధి మార్గాలపై ఛైతన్యం కలిగించాలని అధికారులకు సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో గత ఏడాది జనవరి 25 నుంచి ఈ నెల 27 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3.08 కోట్ల మంది సేవలు పొందారని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ తెలిపారు. సచివాలయాల పనితీరుపై సమీక్షించారు. సేవలను మరింత విస్తృత పరిచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రహదారులకు మరమ్మతులు చేయండి