ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొత్తగా 10 కేసులు.. కొవిడ్ పాజిటివ్ బాధితుల సంఖ్య 483కు చేరిక - b

10 new-cases-in-ap
10 new-cases-in-ap

By

Published : Apr 14, 2020, 9:09 PM IST

Updated : Apr 15, 2020, 7:44 AM IST

21:07 April 14

కొత్తగా 10 కేసులు.. కొవిడ్ పాజిటివ్ బాధితుల సంఖ్య 483కు చేరిక

కరోనా మహమ్మారి.. చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది. మంగళవారం  ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు..రాష్ట్రంలో 10 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో కొత్తగా ఐదుగురికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. అనంతపురంలో ముగ్గురికి, కడపలో కొత్తగా ఇద్దరికి పాజిటివ్ ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మొత్తంగా...రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 483కు పెరిగింది.  

ఒక్క రోజులోనే 21 కేసులు

గుంటూరు జిల్లాలో అత్యధికంగా 114 పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో ఒక్కరోజే 21 కేసులు నమోదు అయ్యాయి. నరసరావుపేట, దాచేపల్లిలో కేసుల సంఖ్య పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. దాచేపల్లిలో ఓ ఆర్​ఎంపీ వైద్యుడికి పాజిటివ్‌గా తేలడంతో..అతని వద్ద వైద్యచికిత్సలకు వచ్చినవారు..పెద్దసంఖ్యలో రక్తనమూనాలను అందించారు.

కడప జిల్లాలో కొత్తగా ఇద్దరికి వైరస్‌ సోకడంతో బాధితుల సంఖ్య 33కు పెరిగింది. ప్రొద్దుటూరు చెందిన ఓ మ‌హిళ‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు... అధికారులు ధ్రువీకరించారు. ఈమె దిల్లీకి వెళ్లి వ‌చ్చిన వ్యక్తి సోద‌రిగా గుర్తించారు.  ఇతర జిల్లాల్లో పరిస్థితి చూస్తే.. నెల్లూరులో 56, కృష్ణాలో44 కేసులు నమోదు అయ్యాయి. కృష్ణా జిల్లాలో ఒక్క రోజులోనే 8 పాజిటివ్‌ కేసులు నిర్ధరించారు. విజయవాడలోనే అధికంగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు జిల్లాలో 1687మంది నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. వీటిలో 44 పాజిటివ్, 892 నెగటివ్ వచ్చాయి. 751 మంది రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా 16 మంది డిశ్చార్జ్

మిగతా జిల్లాల్లో చూస్తే..ప్రకాశం 42, చిత్తూరు జిల్లాలో 23, విశాఖ జిల్లాలో 20పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకు 17 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. తాజాగా ఇద్దరు కోలుకున్నారు. కాకినాడకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి, పెద్దాపురానికి చెందిన 65 ఏళ్ల వ్యక్తి వైరస్‌ నుంచి కోలుకోవడంతో కాకినాడ జీజీహెచ్ నుంచి ఇద్దరిని డిశ్చార్జ్ చేశారు. వీరిద్దరు దిల్లీ మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారే. మొత్తంగా ఈ జిల్లాలో ఇప్పటి వరకు కరోనా బారినుంచి ముగ్గురు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా  ఇప్పటివరకు 16మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 458 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇదీ చదవండి :

ప్రధాని మోదీతో ఆలోచనలు పంచుకున్నా: చంద్రబాబు

Last Updated : Apr 15, 2020, 7:44 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details