ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM - ap top ten news

..

1 PM Top News
ప్రధాన వార్తలు @ 1 PM

By

Published : Mar 25, 2022, 1:00 PM IST

  • పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం మరో మెలిక.. సామాజిక, ఆర్థిక సర్వే మరోసారి నిర్వహించాలని షరతులు
    పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం మరో మెలిక పెట్టింది. సామాజిక, ఆర్థిక సర్వే మరోసారి నిర్వహించాలంటూ షరతులు విధించింది. డిస్ట్రిబ్యూటరీ నెట్ వర్క్ పై DPR తయారు చేయాల్సిందేనని నిబంధన తీసుకొచ్చింది. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తిచేస్తారో గడువు చెప్పాలని కేంద్ర జలశక్తి శాఖ కోరింది.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మూడు రాజధానులపై ముఖ్యమంత్రి మూర్ఖంగా మాట్లాడటం తగదు : శైలజానాథ్
    Sailajanath On Three Capitals: శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూడు రాజధానులపై మూర్ఖంగా మాట్లాడడం తగదని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ అన్నారు. న్యాయ వ్యవస్థకు కూడా గౌరవం ఇవ్వని ముఖ్యమంత్రిని చూస్తున్నామని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఎస్పీ పేరు చెప్పి రూ.15లక్షలు నొక్కేసిన సీఐ.. ఆ తర్వాత?
    CI Corruption: కర్నూలు జిల్లాలో ఓ సీఐ చేతివాటం బయటపడింది. ఓ ప్రయాణికుడి నుంచి 15 లక్షల రూపాయలు బలవంతంగా తీసుకున్నాడు. ఈ విషయమై బాధితుడు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తీగ లాగితే.. డొంక మొత్తం కదిలింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బిడ్డకు జన్మనిచ్చిన.. "పదో తరగతి" బాలిక!
    Student Delivery: ఆ బాలిక చదివేది పదో తరగతి.. కానీ ఓ యువకుడి బెదిరింపులకు భయపడి లైంగిక దాడిని ఎదుర్కొంది. ఎవరికైన చెపితే వీడియోలు బయటపెడతానని ఆ బాలికను బయపెట్టాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బీర్భుమ్ హింసపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశం
    బంగాల్​లో బీర్భుమ్​ సజీవ దహనాల కేసును సీబీఐ దర్యాప్తు చేయాలని కోల్​కతా హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 7లోగా సీబీఐ నివేదిక సమర్పించాలని జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ, జస్టిస్ ఆర్ భరద్వాజతో కూడిన ధర్మాసనం తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చనిపోయిన అన్న పేరుతో ప్రభుత్వ ఉద్యోగం.. 24ఏళ్లుగా దొరకకుండా...
    teacher in the name dead brother: చనిపోయిన సోదరుడి పేరు మీద.. ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు ఓ వ్యక్తి. 24 ఏళ్ల పాటు అందులోనే కొనసాగాడు. అయితే, ఓ సామాజిక కార్యకర్తకు అనుమానం వచ్చి కేసు వేయగా.. డొంక కదిలింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రూపాయిన్నరతో 50 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. తమిళనాడు యువకుడి ఘనత
    Solar Cycle: రోజురోజుకు పెరుగుతున్న పెట్రో మంటతో సామాన్యుల జేబుకు చిల్లుపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి సౌరశక్తితో నడిచే సైకిల్‌ను రూపొందించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బంగారం ధరకు రెక్కలు.. రూ.1100 పెరిగిన కేజీ వెండి!
    బంగారం ధర భారీగా పెరిగింది. పది గ్రాముల పసిడి గురువారంతో పోలిస్తే.. రూ.330 అధికమైంది. వెండి ధర సైతం పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Virat Kohli MS Dhoni: ధోనీ కెప్టెన్సీ వీడ్కోలుపై కోహ్లీ భావోద్వేగ పోస్టు
    Virat Kohli MS Dhoni: మహేంద్ర సింగ్​ ధోనీ అంటే తనకు ఎప్పుడూ అమితమైన గౌరవమని అన్నాడు భారత మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ. చెన్నై సూపర్​ కింగ్స్​ కెప్టెన్​గా ధోనీ తప్పుకోవడంపై విరాట్​ కోహ్లీ భావోద్వేగ పోస్టు పెట్టాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • RRR Movie Collection: 'ఆర్​ఆర్​ఆర్'.. రూ.3వేల కోట్ల వసూళ్లు ఖాయం? ఇదే రుజువు!
    RRR Movie Collection: విడుదలకు ముందే సినిమాకు పెట్టిన పెట్టుబడిని రాబట్టేసింది! 'బాహుబలి' రికార్డులను తిరగరాసింది! ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే దాదాపు 80 వేల షోలతో సందడి చేస్తోంది 'ఆర్​ఆర్​ఆర్​'. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details