ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1PM

...

1 PM Top News
1 PM Top News

By

Published : Jun 7, 2021, 1:00 PM IST

  • వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభం
    వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో మళ్లీ సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో ఎంక్వైరీ కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కేంద్రం తీరుపై హైకోర్టు అసంతృప్తి..సమగ్ర వివరాలివ్వాలని ఆదేశం!
    బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల కొరతను అధిగమించే చర్యలపై సమగ్ర వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇంజెక్షన్ల కొరతపై కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. కేంద్రం అఫిడవిట్ సరిగా సమర్పించలేదంటూ ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • విద్యార్థుల ప్రాణాలకు పరీక్ష పెట్టేలా రివర్స్ నిర్ణయాలు: అనగాని
    కరోనా మూడో దశ ఉద్ధృతికి తెరతీసేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యవహరిస్తున్నారని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. పరీక్షలు పెట్టాలనుకోవడం మూర్ఖత్వమేనని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • షర్మిల పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి.. జులై 8న ప్రారంభం!
    వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (YSRTP) రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ విషయాన్ని పార్టీ సమన్వయకర్త రాజగోపాల్ ప్రకటించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి (YSR Death anniversary) సందర్భంగా జులై 8న (July8) పార్టీ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వైద్యులకు రక్షణ కల్పించాలని మోదీకి ఐఎంఏ లేఖ!
    వైద్యులపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి మోదీ స్వయంగా కలుగజేసుకోవాలని కోరింది భారత వైద్య సంఘం(IMA). ఈ మేరకు మోదీకి లేఖ రాసింది. భయం లేకుండా పనిచేసుకునే వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కాలిన గాయాలతో తల్లి.. సాయానికి బాలుడి వినతి
    ఒంటి నిండా కాలిన గాయాలతో ఉన్న తల్లిని కాపాడుకునేందుకు ఓ బాలుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. వైద్యానికయ్యే ఖర్చు అతని తలకు మించిన భారంలా మారింది. దాతలు సాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'భారత్​కు సరిపడా వ్యాక్సిన్లు అందించండి'
    బైడెన్​ యంత్రాంగం భారత్​కు సరిపడా వ్యాక్సిన్లు, వైద్య సహాయం అందించాలని అమెరికా చట్టసభ్యులు, గవర్నర్​లు సూచించారు. భారత్​ను ఆదుకోవడం అమెరికా బాధ్యత అని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఎగుమతుల్లో చైనా జోరు- 28 శాతం వృద్ధి!
    కరోనా వల్ల భారత్ సహా చాలా దేశాలు సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాల ఎగుమతులపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. కరోనా పుట్టినిళ్లు చైనాలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. మే నెలలో చైనా ఎగుమతులు 28 శాతం పెరిగినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వ్యాక్సినేషన్​పై కేరళ ప్రభుత్వానికి పీటీ ఉష విన్నపం
    క్రీడాకారులకు వీలైనంత త్వరగా టీకాలు వేయాలని కేరళ ప్రభుత్వానికి విన్నవించుకుంది పీటీ ఉష. క్రీడాశాఖను అశ్రద్ధ చేయకూడదని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Nikhil: ఆస్పత్రుల బిల్లులపై హీరో​ ఆగ్రహం
    కరోనా సమయంలో కొన్ని ఆస్పత్రులు సామాన్యుల నుంచి పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు యువ కథానాయకుడు నిఖిల్​. రోగుల దగ్గర నుంచి బిల్లులు వసూలు చేయడంలో కొన్ని ఆస్పత్రులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి వాటికి నియంత్రణ లేదా? అని ట్విట్టర్​ ద్వారా ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details