ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / business

corona effect: పదకొండు శాతం మేర పడిపోయిన ఆక్వా ఎగుమతులు

దేశవ్యాప్తంగా ఆక్వా ఎగుమతుల్లో స్వల్పంగా క్షీణత నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరానికి 11 శాతం మేర విదేశాలకు ఆక్వా ఉత్పత్తుల (Aqua Products)ఎగుమతులు తగ్గినట్లు సముద్ర మత్స్య ఎగుమతుల సంస్థ ఎంపెడా వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 11 లక్షల 49 వేల 341 మెట్రిక్ టన్నుల మత్స్య ఉత్పత్తులు భారత్ నుంచి ఎగుమతి అయినట్లు ఎంపెడా తెలిపింది. ఇందులో అత్యధిక శాతం మేర రొయ్యల ఎగుమతి జరిగినట్టు ఎంపెడా వెల్లడించింది. కొవిడ్​తో పాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో అమలైన లాక్ డౌన్.. హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపారాన్ని దెబ్బతీయటంతో ఎగుమతులు తగ్గినట్లు ఎంపెడా స్పష్టం చేసింది.

aqua products exports fall in india
aqua products exports fall in india

By

Published : Jun 4, 2021, 11:43 AM IST

Updated : Jun 4, 2021, 12:17 PM IST

భారత్ నుంచి ఎగుమతి అయ్యే సముద్ర మత్స్య ఉత్పత్తుల్లో వరుసగా రెండో ఏడాదీ క్షీణత నమోదైంది. దాదాపు 11 శాతం మేర ఎగుమతులు తగ్గుముఖం పట్టినట్లు సముద్ర మత్స్య ఉత్పత్తుల(Aqua Products) ఎగుమతి సంస్థ ఎంపెడా స్పష్టం చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 11 లక్షల 49 వేల 341 మెట్రిక్ టన్నుల సముద్ర మత్స్య ఉత్పత్తులు అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్​లకు ఎగుమతి అయినట్లు ఎంపెడా ఛైర్మన్ కె.ఎస్. శ్రీనివాస్ స్పష్టం చేశారు.

మొత్తంగా ఈ కాలానికి గానూ రూ.43,717 కోట్ల రూపాయల సముద్ర మత్స్య ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయని ఎంపెడా పేర్కొంది. కొవిడ్​తో పాటు అంతర్జాతీయ మార్కెట్ల మందగమనం కారణంగా 10.88 శాతం మేర ఆక్వా ఎగుమతులు తగ్గినట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది. కంటైనర్ల కొరత, విదేశాల్లో లాక్ డౌన్ కారణంగా హోటల్ పరిశ్రమలు మూతపడటం కూడా ఆక్వా మార్కెట్​ను ప్రభావితం చేసిందని ఎంపెడా భావిస్తోంది. కొవిడ్-19 కారణంగా ఎయిర్ కార్గో కనెక్టివిటీ లేకపోవటంతో ఎగుమతుల్లో 11 శాతం మేర క్షీణత నమోదైందని అధికారులు చెబుతున్నారు.

ఎగుమతి అయిన సముద్ర మత్స్య ఉత్పత్తుల్లో 51.36 శాతం మేర వాటా రొయ్యలదేనని ఎంపెడా తెలిపింది. మొత్తం 5 లక్షల 12 వేల 204 మెట్రిక్ టన్నుల రొయ్యలను అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్, తూర్పు ఆసియా, దక్షిణాసియా దేశాలు దిగుమతి చేసుకున్నాయి.

ఎగుమతుల్లో రొయ్యలు మొదటి స్థానాన్ని, రెండో స్థానంలో చేపలు, అలాగే మూడో స్థానంలో ఫిష్ పేస్ట్, స్క్విడ్, కటిల్ ఫిష్ లాంటి ఉత్పత్తులు ఉన్నట్టు ఎంపెడా తెలిపింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 2,856 మిలియన్ డాలర్ల ఎగుమతుల నుంచి ప్రస్తుతం 5,956 మిలియన్ డాలర్ల ఎగుమతులకు చేరుకున్నట్టు ఎంపెడా స్పష్టం చేసింది. అయితే 2017-18 ఆర్ధిక సంవత్సరంలో అత్యధికంగా 7,081 మిలియన్ డాలర్ల సముద్ర మత్స్య ఉత్పత్తులు ఎగుమతి అయినట్టు ఎంపెడా తెలిపింది.

ఇదీ చదవండి:

మూడో దశలో 25% మంది పిల్లలకు వైరస్‌?

Last Updated : Jun 4, 2021, 12:17 PM IST

ABOUT THE AUTHOR

...view details