కరోనా తదనంతర పరిణామాల నేపథ్యంలో నెలకొన్న కష్టకాలంలోనూ స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయంలో తెలంగాణ వృద్ధి సాధించింది. జాతీయ సగటు తగ్గుదల నమోదు కాగా.. తెలంగాణ మాత్రం రెండు అంశాల్లోనూ వృద్ధి సాధించింది. ఈ మేరకు రాష్ట్ర అర్థ, గణాంకశాఖ.. ఈ వివరాలను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖకు అందించింది.
ఆ వివరాల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరానికి జీఎస్డీపీ 9,78,373 కోట్ల రూపాయలుగా పేర్కొంది. 2019-20 జీఎస్డీపీ అయిన 9,65,355 లక్షల కోట్లపై వృద్ధిరేటు 1.35 శాతంగా తెలిపింది. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో జీడీపీ 203.51 లక్షల కోట్ల నుంచి.. 3.8 శాతం తగ్గి 195.86 లక్షల కోట్లుగా నమోదైంది.