ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

అక్రమ కేసులు ఎత్తివేయాలని ఎస్పీని కలిసిన వైకాపా నేతలు - guntur

పల్నాడులో తమ పార్టీ కార్యకర్తలు, నేతలపైన పోలీసులు పెట్టిన అక్రమకేసులు ఎత్తివేయాలంటూ.. వైకాపా నేతలు గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్​ బాబుకు వినతిపత్రం సమర్పించారు. ఇనిమెట్లలో పోలింగ్​ రోజు సభాపతి కోడెల తన స్థాయికి తగ్గట్లు వ్యవహరించలేదని బొత్స సత్యనారాయణ ఆరోపించారు.

'సభాపతి పోలింగ్​ బూత్​ ఆక్రమించేందుకు ప్రయత్నించారు'

By

Published : Apr 15, 2019, 12:02 AM IST

మాపై అక్రమ కేసులు ఎత్తివేయండి : వైకాపా
గుంటూరు జిల్లా పల్నాడులో వైకాపా కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని... ఆ పార్టీ సీనియర్​ నేతలు ఎస్పీ రాజశేఖర్​ బాబును కోరారు. ఇనిమెట్లలో సభాపతి పోలింగ్​ బూత్​ ఆక్రమించేందుకు ప్రయత్నించారని వారు ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి, అంబటి, కాసు మహేశ్​ రెడ్డి..గుంటూరు గ్రామీణ ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని బొత్స డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details