ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

గోదావరిపురంలో తెదేపా ఏజెంట్​పై వైకాపా కార్యకర్తల దాడి

శ్రీకాకుళం జిల్లా గోదావరిపురంలో వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. వేరొకరి ఓటును వేసేందుకు ప్రయత్నించగా.. అడ్డుకున్న తెదేపా బూత్ ఏజెంట్​పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిలో గాయపడిన వ్యక్తి పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

తెదేపా బూత్ ఏజెంట్​పై దాడి

By

Published : Apr 11, 2019, 4:47 PM IST

తెదేపా బూత్ ఏజెంట్​పై దాడి

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గోదావరిపురంలో తెదేపా పోలింగ్ ఏజెంట్ మార్కండేయులుపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. వేరొకరి ఓటు వేసేందుకు ప్రయత్నించిన వైకాపా నేతలను మార్కండేయులు అడ్డుకున్నారు. ఈ విషయమై ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తులైన వైకాపా నేతలు తనపై దాడి చేసి గాయపరిచారని మార్కండేయులు కాశిబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయాలపాలైన మార్కండేయులును పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details