ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

వైకాపా తొలి హామీ... వైఎస్సార్ పింఛన్​ జీవో జారీ - వైఎస్సార్ పింఛను జారీ

నూతన పింఛన్​ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకూ ఉన్న ఎన్టీఆర్ భరోసా పేరు మారుస్తూ...వైఎస్సార్ పింఛన్​ కానుక అనే కొత్త పేరుతో పథకాన్ని ప్రకటించింది. వృద్ధాప్య పించన్​ పెంపుపై తొలిసంతకం చేసిన సీఎం జగన్...వాటి అమలును ప్రారంభించారు. రేపటినుంచి ఈ పింఛను పథకం అమల్లోకి రానుంది. వీటిపై ప్రభుత్వం జీవో జారీ చేసింది.

నవరత్నాల్లో తొలి హామీ...వైఎస్సార్ పింఛను కానుక జీవో జారీ

By

Published : May 31, 2019, 1:40 PM IST

Updated : May 31, 2019, 1:50 PM IST

వైకాపా తొలి హామీ... వైఎస్సార్ పింఛన్​ జీవో జారీ

ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్​మోహన్​రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున ప్రకటించిన విధంగానే వైఎస్సార్ పింఛన్​ కానుక పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఎన్టీఆర్ భరోసా పేరును వైఎస్సార్ పింఛను కానుకగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పింఛన్​ రూ. 2250లకు పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నూతన పింఛను పథకం జూన్ 1 నుంచి అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కొత్త పింఛను పథకం ప్రకారం వికలాంగులకు రూ. 3 వేలు, కిడ్నీ బాధితులకు రూ. 10 వేలు అందించనున్నారు. వృద్ధాప్య పింఛను అర్హుల వయస్సును 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. నవరత్నాల్లో ఒకటైన పింఛను పెంపుపై తొలి అడుగు పడింది.

Last Updated : May 31, 2019, 1:50 PM IST

ABOUT THE AUTHOR

...view details