వైకాపా ప్రభుత్వం తాజాగా ప్రకటించిన వైఎస్సార్ పింఛను కానుక...రేపట్నుంచి అమల్లోకి వచ్చి జులైలో నగదు అందుతుందని కర్నూలు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులకు పింఛన్ల మొత్తంతో కలిపి పెంచిన రూ.250 అందుతాయని చెప్పారు. ఈ మొత్తాన్ని జూన్, జులై నెలకు కలిపి జూలై నెలలో రూ.2500 ఇవ్వనున్నట్లు తెలిపారు. జూన్ నెలలో మాత్రం పింఛన్లు రూ. 2 వేలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. కిడ్నీ రోగుల పింఛన్ రూ. 10 వేలకు పెంచినట్లు తెలిపారు. వృద్ధాప్య పింఛన్ల అర్హుల వయస్సును 65 నుంచి 60 ఏళ్లకు ప్రభుత్వం తగ్గించినట్లు తెలిపిన ఆయన... అర్హులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. దివ్యాంగులకు రూ. 3 వేలు పింఛను అందించనున్నామని తెలిపారు.
జులైలో వైఎస్సార్ పింఛన్ కానుక అందజేత: కలెక్టర్
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వైఎస్సార్ పింఛను కానుక జూన్ నుంచి ప్రారంభమౌతుందని కర్నూలు జిల్లా కలెక్టర్ తెలిపారు. పెంచిన పింఛను నగదును జులైలో అందజేయనున్నామని స్పష్టం చేశారు. వృద్ధాప్య పింఛను అర్హత వయస్సును 5 సంవత్సరాలు తగ్గించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ