మీ ఓటును దొంగల నుంచి కాపాడుకోండి: సీఎం - cm tweet
ఓటు నమోదుపై ప్రజలకు ట్విట్టర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు చేశారు. ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఈరోజే ఆఖరి అవకాశమని గుర్తు చేశారు.

ఓటు నమోదుపై ప్రజలకు ట్విట్టర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు చేశారు.ఓటు నమోదు దరఖాస్తుకు ఈరోజే ఆఖరిరోజని...చట్టప్రకారం నామినేషన్ల చివరిరోజు వరకు నమోదుకు అవకాశం ఉందని తెలిపారు.ఫారం-6అందించాక నమోదు కోసం అధికారులకు కనీసం10రోజులు పడుతుందన్నారు.ఓటు లేనివారంతా ఇవాళ దరఖాస్తు చేసుకోవాలని ట్వీట్ చేశారు.ఓటు దొంగల నుంచి ప్రజలు ఓటు కాపాడుకోవాలన్నారు.జాబితాలో సరిచూసుకోకపోతే తర్వాత ప్రయోజనం ఉండదన్నారు.స్వార్థ ప్రయోజనాల కోసం నేరం చేయటం నేరస్థులకు అలవాటని...ఆర్థిక నేరమైనా,సైబర్ క్రైం అయినా నిస్సంకోచంగా చేస్తారని ఎద్దేవాచేశారు.కులం,మతం,ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని సీఎం ట్విట్ చేశారు.