వైకాపా శాసనసభాపక్ష నేతగా జగన్ ఏకగ్రీవం - జగన్
వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఆపార్టీ అధినేత వైఎస్ జగన్‌ను ఎన్నుకున్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు జగన్‌ను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
![వైకాపా శాసనసభాపక్ష నేతగా జగన్ ఏకగ్రీవం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3382173-587-3382173-1558806043228.jpg)
వైకాపా శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత జగన్‌ను... ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, కరుణాకర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. జగన్‌ను శాసనసభపక్షా నేతగా ఎన్నుకోవాలని బొత్స ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ఎమ్మెల్యేలు పార్థసారధి, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రరెడ్డి బలపర్చారు. సమావేశానికి ముందు ఎమ్మెల్యేలంతా జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేలందరికి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆ పార్టీ నేతలు బొత్స, ధర్మాన, బుగ్గన హైదరాబాద్ వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు జగన్‌ను ఆహ్వానించాలని కోరారు.