ఐదేళ్ల తలరాతను నిర్ణయించేది ఓటు అంటున్నారు గుడివాడ యువత. మద్యం, నగదు తీసుకుని ఓటేస్తే..ప్రజాప్రతినిధులను ప్రశ్నించే హక్కును కోల్పోతామంటూ ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటు గొప్పదనాన్ని వివరిస్తున్నారు. యువతలో మార్పు వచ్చినపుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని తెలియజేస్తున్నారు.
మీరు వేసే ఓటే మీ ఐదేళ్ల తలరాత: గుడివాడ యువత - ap elections 2019
కృష్ణా జిల్లా గుడివాడలో ఇంటింటికీ తిరుగుతూ ఓటుహక్కుపై అవగాహన కల్పిస్తున్నారు 'యూత్ ఫర్ చేంజ్' అనే సంఘం యువకులు. ఓటును నమ్ముకోండి అమ్ముకోవద్దంటూ ఓటర్లను చైతన్యపరుస్తున్నారు.
ఓటుహక్కు పై అవగాహన