ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 9, 2019, 10:22 AM IST

ETV Bharat / briefs

ప్యాకేజీ పేరుతో ఒక్క పైసా రాల్చలేదు: మంత్రి యనమల

ప్రత్యేక ప్యాకేజీ అంటూ ఘనంగా చెప్పుకుంటున్న మోదీ ... ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా విదల్చలేదని మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమం పథకాలకు రాష్ట్రాదాయాన్నే వినియోగిస్తున్నామని... అందులోనూ కేంద్రం సాయం ఏమీ లేదని వివరించారు.

YENAMALA

సమాజంలోని సమస్యలు, ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో తయారుచేశామని మంత్రి యనమల రామకృష్ణుడు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో తెలిపారు.నిరుద్యోగ భృతి ఇప్పటివరకు5లక్షల మందికి ఇచ్చామని స్పష్టం చేశారు.ఎన్నికల తర్వాత నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తామని అన్నారు.

2014ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చామన్నారు.మేనిఫెస్టోలో ఇవ్వని చాలా అంశాలు పూర్తిచేశామన్నారు.పట్టిసీమను పూర్తిచేసి గోదావరి జలాలు కృష్ణాకు తరలించామని తెలిపారు.తెదేపా మేనిఫెస్టో అమలులో కాపు రిజర్వేషన్లు మంచి ఉదాహరణ అన్నారు.నిరుద్యోగ భృతి కాస్త ఆలస్యమైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు.పట్టిసీమ,పురుషోత్తపట్నం వంటివి మేనిఫెస్టోలో లేకపోయినా పూర్తిచేశామన్నారు.

దేశ జనాభాలో ఎక్కువ శాతం పేదరికంతో ఉన్నారని...సంక్షేమ కార్యక్రమాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందన్నారు.తమది సంక్షేమ రాజ్యమని...అందుకే రాష్ట్రంలో రూ.లక్ష కోట్లు ఖర్చుపెడుతున్నామన్నారు.కేంద్రం నుంచి నిధులు అందకపోయినా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు.ప్రజల సొమ్ముతో సంక్షేమ పథకాలు అమలు చేస్తాం తప్ప కేంద్రం సొమ్ము కాదన్నారు.ప్రత్యేక ప్యాకేజీ కింద రాష్ట్రానికి రూపాయి రాలేదని మండిపడ్డారు.

మంత్రి యనమల

ఇవి కూడా చదవండి....

'జనమే మా బలం... భాజపా విజయం ఖాయం'

ABOUT THE AUTHOR

...view details