ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చేందుకు వైకాపా కుట్రలు' - శ్రీకాకుళం తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు

కరవు సీమలో జలాలు పారించిన గొప్ప వ్యక్తి చంద్రబాబు అని రామ్మోహన్‌నాయుడు వ్యాఖ్యానించారు. నేరచరిత్ర ఉన్నవాళ్లు వస్తే రాష్ట్రం నాశనం అవుతుందన్న రామ్మోహన్‌.. ప్రత్యేకహోదా తెలుగుదేశంతోనే సాధ్యమని స్పష్టం చేశారు.

శ్రీకాకుళం జిల్లా పొందూరులో తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎన్నికల ప్రచారం

By

Published : Mar 26, 2019, 9:04 PM IST

శ్రీకాకుళం జిల్లా పొందూరులో తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎన్నికల ప్రచారం
నదులు అనుసంధానం చేసిన అపర భగీరథుడు.. చంద్రబాబునాయుడని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రశంసించారు. శ్రీకాకుళం జిల్లా పొందూరులో తెదేపా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన...కరవుసీమలో జలాలు పారించిన గొప్ప వ్యక్తి చంద్రబాబు అన్నారు. నేరచరిత్ర ఉన్నవాళ్లు వస్తే రాష్ట్రం నాశనం అవుతుందన్న రామ్మోహన్‌నాయుడు.. అఫిడవిట్‌లో నేరచరిత్ర రాసేందుకు జగన్‌ అదనపు కాగితాలు అడిగారని వెల్లడించారు. పొందూరులోని చేనేత కార్మికులను ఆదుకుంటామన్న.. రామ్మోహన్‌వైకాపా నేతలు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. భాజపా, తెరాసతో కలిసి దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చేందుకు వైకాపా ప్రయత్నిస్తుందన్నారు. ప్రత్యేకహోదా తెలుగుదేశంతోనే సాధ్యమని మరోసారి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details