ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఈ నెల 7న వైకాపా శాసనసభాపక్ష సమావేశం - సీఎల్పీ సమావేశం

వైకాపా శాసనసభాపక్ష సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 7న తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. 8వ తేదీన జరిగే మంత్రి వర్గ కూర్పుపై ఈ సమావేశంలో జగన్ ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు.

ఈ నెల 7న వైకాపా శాసనసభాపక్షం సమావేశం

By

Published : Jun 2, 2019, 2:05 PM IST

ఈ నెల 7న వైకాపా శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు వైకాపా వర్గాలు తెలిపాయి. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి....వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఈ నెల 8న జరిగే మంత్రి వర్గ కూర్పుపై సీఎం జగన్ ఈ సమావేశంలో చర్చించనున్నారు. మంత్రుల ఎంపికపై శాసనసభ్యులతో చర్చించిన అనంతరం సీఎం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details