తెదేపా అధికార ప్రతినిధి యామినీశర్మ స్వార్ధ రాజకీయాల కోసం కుటుంబ సభ్యులందరినీ జగన్ రోడ్డుపై నిలబెట్టారని తెదేపా అధికార ప్రతినిధి యామినీశర్మ విమర్శించారు. అధికారం కోసం వలస పక్షుల్లా వైఎస్ కుటుంబ సభ్యులు ఐదేళ్ల తరువాత బయటికి వచ్చారని ఆరోపించారు.కుమారుడి మీద ప్రేమతో జగన్కు ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతున్న వైఎస్ విజయమ్మకు...రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండటం ఇష్టం లేదా అని యామినీ శర్మ ప్రశ్నించారు. రాష్ట్రంలోని తల్లులు, ఆడపడుచులు భవిష్యత్తు తరాలను నాశనం చేయవద్దంటూ వేడుకొంటున్నారని యామినీ పేర్కొన్నారు. కోటి మంది అక్కాచెల్లెలకు తెదేపా ఇస్తున్న పసుపు కుంకుమపై తప్పుడు ప్రచారం చేయటం సరికాదన్న ఆమె...జగన్ అధికారంలోకి వస్తే అవినీతి, అక్రమాలు పెరుగుతాయని ప్రజలు భయపడుతున్నారని తెలిపారు.
ఇవీ చూడండి