ముఖ్యమంత్రి చంద్రబాబును ఎదుర్కోలేకనే వైకాపా అధినేత జగన్ను అడ్డుపెట్టుకొని రాష్ట్రంపై పెత్తనం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ కుట్రలకు పాల్పడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి యామినిశర్మ ఆరోపించారు. ప్రధాని పదవికే కళంకం తెచ్చే విధంగా మోదీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వీరి కుట్రలను తిప్పికొడుతూ ప్రజలు తెలుగు దేశం పక్షాన నిలుస్తున్నారని... మే 23న వచ్చే ప్రజాతీర్పుతో వారి రాజకీయ జీవితం ముగుస్తుందన్నారు. వైకాపాను అడ్డుపెట్టుకొని ప్రధాని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహారిస్తున్నారన్నారు.
ప్రధాని చర్యలు ప్రజాస్వామ్యానికే ముప్పు: యామినిశర్మ - tdp yamini
ఆంధ్రులను, ముఖ్యమంత్రి చంద్రబాబును ధైర్యంగా ఎదుర్కోలేక ప్రధాని వైకాపాను అడ్డుపెట్టుకొని దొడ్డిదారిన కుట్రలకు పాల్పడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి యామినిశర్మ ఆరోపించారు. మే 23న వెలువడే ప్రజాతీర్పుతో వారి రాజకీయ జీవితం ముగుస్తుందన్నారు.
తెదేపా అధికార ప్రతినిధి యామినిశర్మ