ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఈ శాసనసభలో కూర్చోనున్న 14 మంది మహిళలు - womens

రాష్ట్రంలో వైకాపా 151 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొంది భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక నారీ మనుల విషయానికొస్తే వైకాపా నుంచి మొత్తం 15 మంది మహిళలు బరిలోకి దిగితే...13 మంది ప్రభంజనం సృష్టించారు. తెదేపా నుంచి ఒకరు గెలుపొందారు.

women

By

Published : May 24, 2019, 9:09 AM IST

వైకాపా...

ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా మహిళా అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు.వైకాపా తరపున15మంది పోటీ చేయగా13మంది విజయం సాధించారు.అత్యధికంగా గుంటూరు జిల్లాలో వైకాపా నుంచి ముగ్గురు మహిళా అభ్యర్థులు గెలుపొందారు.నగరి నుంచి ఆర్.కె.రోజా,పాతపట్నం నుంచి రెడ్డి శాంతి,పాలకొండ(ఎస్టీ)నుంచి విశ్వసరాయ కళావతి,కురుపాం(ఎస్టీ)నుంచి పాముల పుష్పా శ్రీవాణి,పాడేరు(ఎస్టీ)నుంచి కె.భాగ్యలక్ష్మి,రంపచోడవరం(ఎస్టీ)నుంచి నాగులపల్లి ధనలక్ష్మి,కొవ్వూరు(ఎస్సీ)నుంచి తానేటి వనిత,ప్రత్తిపాడు(ఎస్సీ)నుంచి మేకతోటి సుచరిత,చిలకలూరిపేట నుంచి విడదల రజిని,పత్తికొండ నుంచి కె.శ్రీదేవి,సింగనమల(ఎస్సీ)నుంచి జొన్నలగడ్డ పద్మావతి,కళ్యాణదుర్గం నుంచి కేవీ ఉషా శ్రీచరణ్‌ ఎన్నికల బరిలో దిగి గెలుపొందారు.

తెదేపా....

ఇక తెదేపా నుంచి19మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా వారిలో రాజమహేంద్రవరం నగర అభ్యర్థి ఆదిరెడ్డి భవాని ఒక్కరే విజయం సాధించారు.

జనసేనా...

జనసేన పార్టీ నుంచి21మంది మహిళా అభ్యర్థులను బరిలోకి దించగా వారందరూ ఓడిపోయారు.

జగన్ కేబినెట్ లో5మహిళలకు అవకాశం!

జగన్‌మోహన్‌ రెడ్డి ఏర్పాటు చేసే కేబినెట్‌లో ఐదుగురు మహిళలకు అవకాశం దక్కనుందని తెలుస్తోంది.చిత్తూరు జిల్లా నగరి నుంచి గెలుపొందిన రోజా,శ్రీకాకుళం జిల్లా పాలకొండ(ఎస్టీ)నుంచి విశ్వసరాయ కళావతి,పాతపట్నం నుంచి రెడ్డి శాంతి,విజయనగరం జిల్లా కరుపాం నుంచి పాముల పుష్పశ్రీవాణి,పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి గెలుపొందిన తానేటి వనితకు కేబినేట్‌లో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details