సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికుల డిమాండ్
కడపలో ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఈ నెల 9న ఎండీకి నోటీసు ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని ఐకాస నాయకులు కె.కె. కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 22న ఛలో ఆర్ఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సమస్యల పరిష్కారానికై ఆర్టీసీ కార్మికులు ఈ నెల 9న ఎండీకి సమ్మె నోటీసు ఇచ్చారు. సమ్మె నోటీసులో భాగంగా కడప డిపో వద్ద ఐకాస ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. యూనియన్ జెండాలు పట్టుకొని ఆర్టీసీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ యాజమాన్యం దిగివచ్చి కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 24 తర్వాత ఏ క్షణమైనా సమ్మెలోకి వెళ్తామని ఆర్టీసీ ఐకాస నాయకులు కె.కె. కుమార్ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన 40 శాతం బకాయిలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అద్దె బస్సులను పెంచే ఆలోచనను విరమించుకోవాలన్నారు. వివిధ విభాగాల్లో జరుగుతున్న ప్రైవేటీకరణను ఆపాలని హెచ్చరించారు. అన్ని విభాగాల్లో కార్మికులపై జరుగుతున్న వేధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 22న ఛలో ఆర్ఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.