ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఏ అర్హత ఉందని జగన్‌కు అవకాశమివ్వాలి: బాబూ రాజేంద్రప్రసాద్‌ - తెదేపా ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌

ఎన్నికల సంఘాన్ని ప్రధాని మోదీ ప్రభావితం చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు. ఐపీఎస్‌ అధికారుల బదిలీలపై సుప్రీంకోర్టుకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఏ అర్హత చూసి జగన్‌కు అవకాశం ఇవ్వాలో విజయమ్మ సమాధానం చెప్పాలన్నారు.

తెదేపా ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌

By

Published : Mar 29, 2019, 3:46 PM IST

తెదేపా ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌
ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించటం వెనుక ప్రధాని మోదీ ఉన్నట్లు అనుమానం కలుగుతుందని ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ సందేహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల తర్వాత వచ్చి.. జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని వైఎస్ విజయమ్మ, షర్మిల అడుగుతున్నారని అమరావతిలో జరిగిన సమావేశంలోఎద్దేవా చేశారు. జగన్‌కు ఏ అర్హత చూసి అవకాశం ఇవ్వాలో విజయమ్మ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్​కుచంద్రబాబుని విమర్శించే అర్హత లేదన్న రాజేంద్రప్రసాద్..బాబు పెట్టిన భిక్ష వల్లే ఆయన ఈ స్థాయికి వచ్చాడని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో వేలు పెడతామన్న కేసీఆర్, కేటీఆర్ ఏమయ్యారని ప్రశ్నించారు. సీఎం పదవి కోసం 1500 కోట్ల రూపాయలు జగన్‌ లంచం ఇవ్వజూపారని ఫరూక్‌ అబ్దుల్లా చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన రాజేంద్రప్రసాద్‌...వైకాపాకు సిట్టింగ్ ప్రెసిడెంట్ విజయమ్మ, స్టాండింగ్ ప్రెసిడెంట్ షర్మిల, వాకింగ్ ప్రెసిడెంట్ జగన్ అని విమర్శించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details