రాష్ట్రంపై ఫొని తుపాను ప్రభావం ఎంత.. ? - thufan
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని పెను తుపాను ఒడిశా తీరం వైపు పయనిస్తోంది. తీరం దాటే సమయంలో తుపాను ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలపై అధికంగా ఉండనుంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఫొని పెను తుపానుగా కొనసాగుతోంది. గడచిన 6 గంటల్లో ఉత్తర వాయవ్యంగా 6 కి.మీ. వేగంతో కదులుతోంది. పూరీకి దక్షిణనైరుతి దిశగా 650 కి.మీ. దూరంలో ఫొని కేంద్రీకృతమైంది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 390 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. వచ్చే 6 గంటల్లో ఉత్తరదిశగా కదలనున్న ఫొని ఉధృతం కానుంది. తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా ఫొని పెనుతుపాను పయనించనుంది. రాష్ట్రంపై ఫొని తుపాను ప్రభావం ఎలా ఉండనుంది. అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు. వాతావరణ శాఖ అధికారి మూర్తితో ముఖాముఖి.