12 గంటల్లో తుపానుగా మారనున్న వాయుగుండం! - taza-vayugundam
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం, సాయంత్రానికి తుపానుగానూ మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తమిళనాడు, కోస్తాంధ్ర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని అంచనా. రాయలసీమలో మాత్రం పొడి వాతారణం ఉండనుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కొనసాగుతోంది.శ్రీలంక తీరానికి దగ్గరగా తీవ్రవాయుగుండం కదులుతోంది.ట్రింకోమలీ(శ్రీలంక)కు తూర్పు ఆగ్నేయదిశగా870కి.మీ.దూరంలో కేంద్రీకృతం అయింది.చెన్నైకు ఆగ్నేయదిశగా1210కి.మీ.దూరంలో కేంద్రీకృతం అయి....మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయదిశగా1500కి.మీ.దూరంలో కేంద్రీకృతం అవుతోంది.తీవ్రవాయుగుండం మరో12గంటల్లో తుపానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.మరో24గంటల్లో తీవ్రతుపానుగా మారే సూచనలు ఉన్నాయని పేర్కొంది.ఈ నెల30నాటికి తమిళనాడు,దక్షిణ కోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశం ఉందని...మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నట్లు వెల్లడించింది.
TAGGED:
taza-vayugundam