ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతాం: మాగంటి బాబు - eluru

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 135 స్థానాలు కైవసం చేసుకొని అధికారం దక్కించుకుంటుదని ఏలూరు ఎంపీ మాగంటి బాబు ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెదేపా రాష్ట్రంలోనే కాకుండా... దేశంలోనూ కీలక శక్తిగా మారుతుందని వ్యాఖ్యానించారు.

మాగంటి బాబు

By

Published : Apr 17, 2019, 5:16 PM IST

మాగంటి బాబు

సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా తిరిగి విజయం సాధించడం తథ్యమని ఏలూరు ఎంపీ మాగంటి బాబు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన... మహిళలు తెదేపాకు అండగా ఉన్నారని, తెదేపా గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి రావడం కష్టమేనని అన్నారు. ఎన్నికలను నిర్వహించడంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందన్నారు.

ABOUT THE AUTHOR

...view details