ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

నన్నయ్య విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ కార్యశాల

సుస్థిరాభివృద్ధి సాధించడానికి నీరు ప్రధాన పాత్ర పోషిస్తుందని అటువంటి నీటిని సద్వినియోగం చేసుకుంటూ భావితరాలను కాపాడాలని ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం జపాన్ ఆచార్యులు డా. గైలియ రోడెర్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో 'సుస్థిరాభివృద్ధి కొరకు నీరు' అంశంపై అంతర్జాతీయ కార్యశాల నిర్వహించారు.

నన్నయ్య విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ కార్యశాల

By

Published : Jun 29, 2019, 9:24 AM IST

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం వెలుగు బంద ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం లో "సుస్థిరాభివృద్ధి కొరకు నీరు" అనే అంశంపై అంతర్జాతీయ కార్యశాల నిర్వహించారు. అర్ధశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ కార్యశాలకు ముఖ్యఅతిథిగా ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం జపాన్ నుంచి ఆచార్యుడు డా. గైలియ రోడెర్, గీత మోహన్, సరోజ్ కుమార్ చప్పా గైన్ హాజరయ్యారు.
సుస్థిరాభివృద్ధి సాధించడానికి నీరు ఎంతో ఉపయోగపడుతుందని దానిని సద్వినియోగం చేసుకున్న దేశాలు అభివృద్ధి సాధించాయని డా. గైలియ రోడెర్ అన్నారు. భారతదేశంలో ఉన్న నీటి వనరులను సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా ఎంతో అభివృద్ధిని సాధించవచ్చునని తెలియజేశారు. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ప్రకృతికి హాని కలగించడం మంచిది కాదన్నారు. దాని ప్రభావం మానవ జీవన విధానంపై పడుతుందన్నారు. జీవనాధారమైన నీటిపై శ్రద్ధ చూపకపోతే వరదలు విపత్తులు సంభవిస్తాయని ఆయా దేశాలలో జరిగిన సంఘటనలను ఆధారం చేసుకుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్​తో వివరించారు.
చిన్న చిన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ నీటిని ఏవిధంగా సద్వినియోగం చేసుకోవాలని తద్వారా ఆర్థికంగా సామాజికంగా ఎలా అభివృద్ధి సాధించాలని అనే అంశాలపై గీతా మోహన్ వివరించారు. యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య ఎస్. టేకి అంతర్జాతీయ కార్యశాలకు సంబంధించిన విషయాలను విద్యార్థులకు తెలియజేశారు.

నన్నయ్య విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ కార్యశాల
ఇదీ చదవండీ :

ABOUT THE AUTHOR

...view details