వరుసగా ఆరో రోజు రాజ్యసభ వాయిదా
ప్రతిపక్షాల నిరసనలతో రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు ఉపసభాపతి. వరుసగా ఆరో రోజు సభ కార్యక్రమాలు సజావుగా సాగలేదు.
ఉదయం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే మధ్యాహ్నానికి వాయిదా పడింది. రెండు గంటలకు తిరిగి ప్రారంభమైన తర్వాతా ఆందోళనలు తగ్గకపోవటంతో ఐదు నిమిషాలకే వాయిదా వేశారు ఉపసభాపతి.
విపక్షాలు చెబుతున్న అభ్యంతరాలపై ఉపరాష్ట్రపతికి ఎలాంటి నోటీసులు అందలేదని, వాటిని చర్చలోకి తీసుకోలేమని సభ్యులకు ఉపసభాపతి స్పష్టం చేశారు. ప్రవేశపెట్టిన బిల్లులపై చర్చించాలని ఉపసభాపతి కోరినా విపక్షాలు ఆందోళనలను కొనసాగించారు. కాగితాలను వెల్లోకి విసిరేస్తూ ప్రత్యేక హోదా కావాలంటూ తెదేపా ఎంపీలు నినదించారు. కర్ణాటక ఆడియో టేపులపై కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.