ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'ఆసుపత్రులు.. జర జాగ్రత్త.. మేము వస్తున్నాం'

విశాఖలో శ్రద్ధ ఆసుపత్రిలో కిడ్నీ ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. నగరంలో ఉన్న మిగతా హాస్పిటల్స్​పై విశాఖ జిల్లా యంత్రాగం దృష్టి పెట్టింది. ఈ విషయంలో విశాఖ పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా, కలెక్టర్ కే భాస్కర్​లు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు.

By

Published : May 17, 2019, 8:02 PM IST

'ఆసుపత్రులు.. జర జాగ్రత్త.. మేము వస్తున్నాం'

'ఆసుపత్రులు.. జర జాగ్రత్త.. మేము వస్తున్నాం'

విశాఖలో వివిధ ఆసుపత్రులపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల శ్రద్ధ హాస్పిటల్​లో కిడ్నీ అమ్మకం ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. విశాఖ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టామని పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యాల కనుసన్నల్లోనే ఇలాంటి దురాఘతాలు జరుతున్నాయనీ... ఈ ఆసుపత్రులపై కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నట్లు చెప్పారు. నియమ నిబంధనలు పాటించకుండా అవయవ మార్పిడి చేసే వైద్యులపై, హాస్పిటల్స్​పై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
నగరంలో కిడ్నీ మార్పిడి విషయంలో శ్రద్ధ ఆసుపత్రి మాత్రమే బయటకు వచ్చిందనీ.. అయితే ఎలాంటి రికార్డుల నిర్వహణ చేపట్టకుండా ఇలా అవయవ మార్పిడి చేస్తున్న ఆసుపత్రులు చాలా ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని జిల్లా కలెక్టర్ కే. భాస్కర్ తెలిపారు. వీటిపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు. కిడ్నీ అమ్మకం వ్యవహారంలో ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక రెండు రోజుల్లో అందుతుందనీ.. అనంతరం దీనిపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని వివరించారు. అన్ని ఆసుపత్రులు కచ్చితమైన మెడికల్ రిజిస్టర్ నిర్వహించాలనీ.. లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details