తొడకొట్టి చెబుతున్నా.. 130 స్థానాలు మావే: బుద్ధా - 130 స్థానాలు గెలుస్తాం
లగడపాటితో సహా నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఏవీ నిజం కావని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న అన్నారు. తెలుగుదేశం పార్టీ 130 స్థానాలు గెలిచి తిరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
![తొడకొట్టి చెబుతున్నా.. 130 స్థానాలు మావే: బుద్ధా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3331679-thumbnail-3x2-budhanew.jpg)
రాష్ట్రంలో తెదేపా భారీ మెజారిటీతో ఘన విజయం సాధిస్తుందని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న అన్నారు. తెదేపా మొత్తం 130 స్థానాలు గెలుచుకుంటుందని తొడ కొట్టి చెప్పారు. 2014 ఎన్నికల ముందు వైకాపా నేతలు ఇంతకంటే ఎక్కువే ఊహల్లో తేలియాడారని ఎద్దేవా చేశారు. అప్పడు ఎగ్జిట్ పోల్స్ కి భిన్నంగా రాష్ట్రంలో ఫలితం వచ్చిందని ఆయన గుర్తు చేశారు. తెలుగుదేశం శ్రేణులెవరూ నిరాశ చెందాల్సిన పని లేదని అన్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబే ప్రమాణం చేసి చరిత్ర సృష్టిస్తారని బుద్ధా వెంకన్న జోస్యం చెప్పారు.