సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సన కార్యక్రమానికి సుమారు 5 వేల మంది పోలీసు సిబ్బంది స్టేడియం వద్ద బందోబస్తుగా ఉంటారని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈటీవీ భారత్ ముఖాముఖికి ఆయన వివరాలు వెల్లడించారు. భద్రత పరంగా ఎటువంటి అంతరాయం కలుగకుండా ఉండేందుకు ఆక్టోపస్ బలగాలను వినియోగిస్తున్నట్లు చెప్పారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే వీఐపీ, వీవీఐపీలకు ప్రత్యేక ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేశామన్నారు. ఆ రోజు భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా దారిమళ్లిస్తామని సీపీ స్పష్టం చేశారు.
జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి "ఆక్టోపస్" భద్రత - విజయవాడ
నూతన సీఎం ప్రమాణ స్వీకారానికి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సిద్ధమవుతోంది. వేదిక ఏర్పాటుతో పాటు, బందోబస్తును ఉన్నతాధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు
ఇవీ చూడండి : పిట్టగోడ ఎక్కిన కారు.. తప్పిన ప్రమాదం
Last Updated : May 27, 2019, 8:33 PM IST