ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

విగ్రహాల సొమ్ము జమ చేయాల్సిందే: సుప్రీం

బీఎస్​పీ పాలనలో తన విగ్రహాలు ఏర్పాటు చేసుకున్న మాయావతి ఆ డబ్బు తిరిగి చెల్లించాల్సిందేనని సుప్రీం కోర్టు ఆదేశించింది

మాయావతి, బీఎస్పీ అధినేత

By

Published : Feb 8, 2019, 5:20 PM IST

సుప్రీంకోర్టులో మాయావతికి చుక్కెదురైంది. బీఎస్​పీ హయాంలో తనతో పాటు తన పార్టీ చిహ్నమైన ఏనుగు విగ్రహాలను లఖ్​నవూ, నోయిడా ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు మాయావతి. దీనికి వినియోగించిన ప్రజాధనాన్ని తిరిగి చెల్లించాలని బీఎస్​పీ అధ్యక్షురాలిని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

సొంత విగ్రహాలు నిర్మించుకోవడానికి ప్రజాధనాన్ని వినియోగించకూడదని దాఖలైన పిటషన్​పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విగ్రహాల కోసం వాడిన సొమ్మును మాయావతి జమ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్​ రంజన్​ గొగొయి​ తెలిపారు. తుది విచారణ ఏప్రిల్​ 12కు వాయిదా పడింది.

ABOUT THE AUTHOR

...view details