ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

చంద్రబాబుకు మద్దతుగా.. అమెరికాలో ర్యాలీలు - tdp pracharam

సార్వత్రిక ఎన్నకల ప్రచారం నేటితో ముగియనుంది. చివరి రోజు తనదైన శైలిలో ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. రాష్ట్రంలోనే కాదు విదేశాల్లోనూ తెదేపాకు మద్దతు లభిస్తోంది. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ విదేశాల్లో ప్రవాసాంధ్రులు ర్యాలీ చేశారు.

tdp pracharam

By

Published : Apr 9, 2019, 12:00 PM IST

చంద్రబాబు మళ్లీ నువ్వే రావాలి: విదేశాల్లో ప్రచారం

తెలుగుదేశం పార్టీపై రాష్ట్రంలోని అభిమానులే కాదు.. విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు సైతం అభిమానాన్ని చాటుకుంటున్నారు. అమెరికాలోని హూస్టన్‌, టెక్సాస్‌ నగరాల్లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని కోరుతూ ప్రవాసాంధ్రులు నగర వీధుల్లో కార్లతో ర్యాలీ చేపట్టారు. 2014 ఎన్నికల సమయంలోనూ తెదేపా తరఫున అమెరికాలో ప్రచారం చేశామన్నారు.

షార్లెట్‌ నగరంలోనూ కొందరు ప్రవాసాంధ్రులు తెదేపాకు మద్దకుగా ర్యాలీ చేశారు. తెదేపా జెండాలు చేతబూని... చంద్రబాబూ మళ్లీ నువ్వే రావాలంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొనసాగాలంటే.. చంద్రబాబే మళ్లీ సీఎం కావాలని చిన్నారులు సైతం ఆకాంక్షించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details