రాష్ట్ర పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. చిత్తూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని జాతీయ వాతావరణ పరిశోధన సందర్శనం అనంతరం ఆయన తిరుమలకు చేరుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న వెంకయ్యకు... పద్మావతి అతిథి గృహం వద్ద తితిదే జేఈవో శ్రీనివాసరాజు స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి.. మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం వెంగమాంబ అన్నప్రసాదంలో భోజనం చేస్తారు. సాయంత్రం 6 గంటలకు ఆలయం వద్దకు చేరుకుని నాదనీరాజనం కార్యక్రమం వీక్షిస్తారు. వెంకయ్య రెండ్రోజుల పాటు తిరుమలలోనే బస చేయనున్నారు. బుధవారం ఉదయం తిరిగి దిల్లీ పయనమవుతారు. ఈ మేరకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు.
తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య - ఉపరాష్ట్రపతి వెంకయ్య
శ్రీవారి దర్శనార్థం ఉపరాష్ట్రపతి వెంకయ్య... తిరుమలకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాదానికి వెళ్తారు.
venkaiahnaidu