కృష్ణాజిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఏర్పాట్లు చేసిన వివిధ కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి నెలా ఉచిత వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేస్తున్న సిబ్బందిని అభినందించారు. కాలానుగుణంగా వచ్చే కూరగాయలు, పండ్లు తినాలని అప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. ఆహారం అతిగా తినడం వల్లే రోగాలు చుట్టుముడుతున్నాయని అభిప్రాయపడ్డారు. సంపాదనలో కొంతభాగం సమాజానికి వెచ్చించాలని హితవుపలికారు.
పశుసంపద, పాడిపై మక్కువ ఎక్కువ: వెంకయ్య
ఒంగోలుజాతి పశువుల అభివృద్ధిపై ముళ్లపూడి నరేంద్రనాథ్ రాసిన పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. అదే వేదికపై యడ్లవల్లి వెంకటేశ్వరరావును ఉపరాష్ట్రపతి సన్మానించారు.