'నావాళ్లు రాజకీయాల్లోకి రారు' - venkayya naidu
నెల్లూరు జిల్లాలో నాలుగోరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన కొనసాగుతోంది. వెంకటాచలంలో మీడియాతో మాట్లాడిన ఆయన తన కుటుంబసభ్యులు రాజకీయాల్లోకి రారని స్పష్టం చేశారు. స్వర్ణభారత్ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారని తెలిపారు.
నెల్లూరు జిల్లాలో నాలుగోరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన కొనసాగుతోంది.వెంకటాచలంలో మీడియాతో మాట్లాడిన ఆయన తన కుటుంబసభ్యులు రాజకీయాల్లోకి రారని స్పష్టం చేశారు.స్వర్ణభారత్ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారని తెలిపారు.ఇక నుంచి ఐదు అంశాలతో ప్రజల్లోకి వెళ్తానని వెంకయ్యనాయుడు అన్నారు.దేశవ్యాప్తంగా పర్యటించి యువకుల్లో స్ఫూర్తి నింపుతానని పేర్కొన్నారు.శాస్త్రవేత్తల పరిశోధనలు పరిశీలిస్తానని చెప్పారు.దేశానికి వెన్నెముకగా ఉన్న రైతుల వద్దకు వెళ్తానని తెలిపారు.భారతదేశ సంస్కృతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తానని స్పష్టం చేశారు.మాతృభాష పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.ప్రతీ రాజకీయ పార్టీ..తమ మేనిఫెస్టోలో మాతృభాష పరిరక్షణ చర్యలు పొందుపరచాలని కోరారు.