విశాఖ జిల్లాలో ఎండలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఎండ వేడిమి తాళలేక ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. రోజు వారి కూలీల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పనులు చేసుకోవడానికి సాయంత్రం వేళల్లోనే ప్రజలు బయటకు వస్తున్నారు. జిల్లాలోని చోడవరంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటుతున్నాయి. స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఉక్కపోతలో ఉక్కునగరం... ఎండలకు అల్లాడుతున్న జనం - ఉక్కునగరం
భానుడి ప్రతాపానికి విశాఖ జిల్లా వాసులు అల్లాడిపోతున్నారు. పగటి పూట బయటకు రావడానికి భయపడుతున్నారు. వడగాల్పులు, ఉక్కుపోత అధికంగా ఉండడం వలన రోజు వారీ పనులు చేసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉక్కపోతలో ఉక్కునగరం