ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

"వారణాసి బయల్దేరిన నిజామాబాద్​ పసుపు రైతులు" - formers contestent against pm modi

తెలంగాణ లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసి తమ సమస్య గురించి రాష్ట్రమంతా తెలిసేలా చేశారు ఇందూరు రైతులు.  ఇప్పుడు జాతీయ స్థాయిలో తమ సమస్యపై చర్చ జరగాలని ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసిలో నామినేషన్​ వేసేందుకు బయలుదేరారు.

nijaamaabaad-psupu-raitulu

By

Published : Apr 25, 2019, 7:41 PM IST

"వారణాసి బయల్దేరిన నిజామాబాద్​ పసుపు రైతులు"

పసుపు బోర్డు ఏర్పాటే లక్ష్యంగా ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినా తమ సమస్య పరిష్కారం కాలేదని పార్లమెంట్​ ఎన్నికల బరిలో నిలిచారు నిజామాబాద్​ రైతులు. ఇప్పుడు జాతీయ స్థాయిలో తమ సమస్యపై చర్చ జరగాలని ప్రధాని మోదీ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో నామినేషన్​ వేసేందుకు సిద్ధమయ్యారు. సుమారు 50 మంది రైతులు ఈరోజు నిజామాబాద్​​ నుంచి వారణాసికి బయలుదేరారు.

పసుపు బోర్డు ఏర్పాటే లక్ష్యం

ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా, స్వచ్ఛందంగా పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతోనే వారణాసిలో మోదీపై పోటీ చేస్తున్నట్లు​ రైతులు తెలిపారు. రాహుల్​, మోదీలకు వ్యతిరేకంగా నిలవడం తమ ఉద్దేశం కాదని.. జాతీయ స్థాయిలో తమ సమస్యపై చర్చ జరిగితే.. పసుపు బోర్డు ఏర్పాటవుతుందనే ఆశతోనే పోటీ చేస్తున్నామన్నారు.

విమర్శించే బదులు పరిష్కరించండి

కొందరు నేతలు నామినేషన్​ వేయడానికి వెళ్తున్న రైతులకు భూమి లేదని, పంట పండించరని సోషల్​ మీడియాలో విమర్శలు చేస్తున్నారని ఆవేదన చెందారు. తమపై ఆరోపణలు చేసే బదులు సమస్య పరిష్కరిస్తే ఈ పరిస్థితి వచ్చేదే కాదని వాపోయారు.

నిజామాబాద్​- తమిళనాడు 50-50

నిజామాబాద్​ నుంచి 50 మంది, తమిళనాడు నుంచి మరో 50 మంది నామినేషన్​ వేయడానికి బయల్దేరుతున్నారు. ఈనెల 27న కొందరు, 29న మరికొంత మంది నామపత్రాలు దాఖలు చేయనున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని వారు కోరారు.

ఇదీ చూడండి: దరఖాస్తు చేసినవారికి డబ్బు వాపస్​: ఇంటర్​బోర్డు

ABOUT THE AUTHOR

...view details