'భారత్ - అమెరికా నౌకాదళాల పరస్పర సహకారం' - indian navy
ఇరుదేశాల మధ్య పరస్పర సహకారాలు జరిగేందుకు... అమెరికా నౌకాదళానికి చెందిన యుఎస్ఎస్ జాన్ పి.ముర్తా నౌక విశాఖ చేరుకుంది. ఆ నౌకదళ సిబ్బంది, భారత నౌకాదళ సిబ్బందితో భేటీలు, క్రీడా సాధనలు బుధవారం జరిగాయి.
రెండు నేవీల మధ్య స్నేహ భావాన్ని పెంపొందించడంలో ముర్తా నౌక పర్యటన కీలపాత్ర వహించింది. అమెరికా నౌకాధికార్లు... ఐఎన్ఎస్ రణ్విజయను పరిశీలించి వివిధ అంశాలను అడిగి తెలుసుకున్నారు. మెడికల్ ఎమర్జెన్సీలో అనుసరించే పద్దతులపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రీ సెయిల్ సదస్సు కూడా తూర్పు నౌకాదళం ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్యాసేజ్ ఎక్సర్ సైజ్ షెడ్యూల్ పై చర్చించారు. ముర్తా నౌక కెప్టెన్ కెవిన్ లేన్, వైస్ అడ్మిరల్ ఎస్ఎన్ గొర్మడేలు పరస్పరం బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు నేవీ జట్ల మధ్య స్నేహపూర్వక సాకర్ మ్యాచ్ జరిగింది.