కడప జిల్లా రాజంపేట ఎర్రబల్లిలో 65 ఏళ్ల సుమిత్రమ్మను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. కుమారుడు, కోడలితో ఆమె ఉంటున్నారు. వాళ్లిద్దరు లేని సమయంలోనే ఈ దుర్ఘటన జరిగింది. దొంగతనం కోసం వచ్చి హత్య చేశారేమోనన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరించింది.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో వృద్ధురాలి హత్య - old woman
కడప జిల్లా రాజంపేట ఎర్రబల్లిలో వృద్ధురాలి హత్య కలకలం రేపింది. ఎర్రబల్లి నివాసముంటున్న సుమిత్రమ్మ(65) హత్యకు గురైనట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు.
వృద్ధురాలి హత్య