ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

తుపాకీతో కాల్చుకున్న కానిస్టేబుల్​.. పరిస్థితి విషమం

వ్యక్తిగత సమస్యలతో ఓ ఏఆర్​ కానిస్టేబుల్​ సర్వీస్​ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల హైదరాబాద్​కు తరలించారు.

Conistable_Suicide

By

Published : May 4, 2019, 3:41 PM IST

తుపాకీతో కాల్చుకున్న కానిస్టేబుల్​

విధి నిర్వహణలో ఉన్న ఓ ఏఆర్‌ కానిస్టేబుల్‌ తన సర్వీస్‌ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్టారు. ఈ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది. జిల్లా కోశాగారం వద్ద గార్డ్‌ డ్యూటీ నిర్వహిస్తున్న శ్రీనివాస్‌గౌడ్‌ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఉన్నట్టుండి తుపాకీతో కాల్చుకున్నాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్​ను.. జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ శ్వేత, డీఎస్పీ లక్ష్మీనారాయణ జిల్లా కేంద్ర ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. ఆరోగ్యం విషమించిన కారణంగా.. హైదరాబాద్‌కు తరలించారు. వ్యక్తిగత కారణాలే ఆత్మహత్యాయత్నానికి కారణమని పోలీసులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details