'హోదాకు జగన్ వెన్నుపోటు' - modi
వైకాపా అధినేత జగన్ చెప్పేదొకటి.. చేసేదొకటని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి విమర్శించారు. భాజపా సభలకు వైకాపా నేతలు జన సమీకరణ చేస్తూ... ప్రత్యేక హోదా సాధనలో వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.

కాంగ్రెస్ నేత తులసి రెడ్డి
ప్రాంతీయ పార్టీలకు ఆ శక్తి లేదు : తులసిరెడ్డి
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కాంగ్రెస్తోనే సాధ్యమనిపీసీసీ మీడియా సమన్వయ కమిటీ ఛైర్మన్ తులసిరెడ్డి అన్నారు. వైకాపా అధినేత జగన్ ప్రత్యేక హోదాకు వ్యతిరేకమైన భాజపా, తెరాసలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ భరోసా యాత్రను వైకాపా అడ్డుకుంటోందని మండిపడ్డారు. హోదాను తెచ్చే శక్తి ప్రాంతీయ పార్టీలకు లేదని విజయవాడలో స్పష్టం చేశారు.