ఉత్తరకొరియా వ్యవహారాల అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీఫెన్ బీగన్ ప్యాంగ్యాంగ్లో పర్యటిస్తున్నారు. అమెరికా వ్యవహారాల ఉత్తర కొరియా ప్రత్యేక ప్రతినిధి కిమ్ హ్యోక్ చోల్‌తో భేటీ అయ్యారు. వియత్నాం వేదికగా ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్‌ల రెండో భేటీపై సమాలోచనలు జరిపారు. అణ్వాయుధాలు, క్షిపణి పరీక్షల ఉపసంహరణపై జరగనున్న భేటీలో ఉండాల్సిన అంశాలపై చర్చించారు.
ట్రంప్-కిమ్ భేటీకి సన్నాహాలు - ఉత్తరకొరియా
వియత్నాం వేదికగా భేటీ కావాలని నిర్ణయించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్. ఈ సమావేశానికి సన్నాహకంగా రెండు దేశాలు చర్చలు జరుపుతున్నాయి.
ట్రంప్-కిమ్ భేటీకి సన్నాహాలు
ట్రంప్-కిమ్ గతేడాది సింగపూర్‌లో తొలిసారి భేటీ అయ్యారు. అణ్వాయుధాల ఉపసంహరణకు సంబంధించి ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.