ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఈ కాయగూర కిలో 1200 రూపాయలు - rayaghad

విశాఖ మన్యంలో దొరికే బోడసొత్తుకు ప్రస్తుతం గిరిజన ప్రాంత ప్రజలు కొనడానికి ఎగబడతారు. ఆషాడ మాసంలోనే దొరికే ఈ వంటకం కిలో 1200 రూపాయలు పలుకుతుంది. మాంసంలాగా ఉంటుందని అక్కడి స్థానికులు తెలిపారు.

ఈ కాయగూర కిలో 1200 రూపాయలు

By

Published : Jul 3, 2019, 6:19 AM IST

మన్యంలో ఆ రెండు నెలలు దొరికే బోడసొత్తును ఏవోబీలోనున్న ప్రజలు ఎగబడతారు. ప్రకృతి అందాలకు నెలవైన కోరాపుట్ జిల్లాలో ఆషాడంలో దొరికే బోడసొత్తుకి విపరీతమైన గిరాకీ ఉంటుంది. కిలో 1200 రూపాయలు ప్రజలు కొని తింటారంటే విచిత్రమే కదా.
ఏవోబీలో గల కోరాపుట్, మల్కానాగిరి, నవరంగపూర్, రాయగడ జిల్లాలో ఆషాడంలో ఈ బోడసొత్తు దొరుకుతుంది. రుతుపవనాలు నేపథ్యంలో వచ్చే ఉరుములకు గుగ్గిలం చెట్లు వద్ద భూమిలోన బోడసొత్తు పుడుతుంది. కిలో 1200 నుంచి మొదలై క్రమంగా తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం 800 నుంచి 600 పలుకుతుంది. ఇది మాంశం లాగా ఉంటుందని స్థానికులు తెలిపారు. బంగాళదుంప లాగా కనిపంచడం విశేషం.

ఈ కాయగూర కిలో 1200 రూపాయలు

ABOUT THE AUTHOR

...view details