ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'ఫిట్​నెస్ లేని బస్సులు నడిపితే...పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు​'

విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠశాలల బస్సులన్నింటికీ ఫిట్​నెస్ ధృవీకరణ చేయించుకోవాలని విశాఖ జిల్లా రవాణాశాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. విద్యార్థులు సురక్షిత బస్సుల్లో ప్రయాణిస్తున్నారా లేదా అనేది తల్లిదండ్రుల పరిశీలించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ ఫిట్​నెస్ లేని పది బస్సులను సీజ్ చేశామన్నారు.

విశాఖ జిల్లా రవాణాశాఖ అధికారి వెంకటేశ్వరరావు

By

Published : Jun 15, 2019, 6:57 AM IST

విశాఖ జిల్లా రవాణాశాఖ అధికారి వెంకటేశ్వరరావు
ఫిట్​నెస్ పరీక్ష చేయించని పాఠశాలల బస్సులపై దాడులు కొనసాగిస్తామని విశాఖ జిల్లా రవాణా శాఖ ఉపకమిషనర్ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. సురక్షిత బస్సులలో పిల్లలు ప్రయాణించాలనేది తమ ధ్యేయంగా ఆయన చెప్పారు. నిబంధనలు అతిక్రమించే పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలల ప్రారంభ సమయంలో సంబంధిత బస్సులో ప్రయాణించే హక్కు తల్లిదండ్రులకు ఉంటుందని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని..బస్సు పరిస్థితి, డ్రైవర్ సహా అందులో ఉన్న సిబ్బంది తీరును పరిశీలించాలని కోరారు. విశాఖ జిల్లాలో నాలుగు వందలకు పైగా పాఠశాలల బస్సులు ఇంకా ఫిట్​నెస్ పరీక్షలు కావాల్సి ఉందని ఆయన అన్నారు. శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో ఫిట్​నెస్ ధృవీకరణ లేని 10 బస్సులను సీజ్ చేశామన్నారు.

ABOUT THE AUTHOR

...view details