ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

జంగారెడ్డిగూడెంలో రోయింగ్​ క్రీడకు శిక్షణ - yerrakaluva

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఎర్రకాలువ జలాశయంలో రోయింగ్​ ఆట శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

జంగారెడ్డిగూడెంలో రోయింగ్​ ఆటకు శిక్షణ

By

Published : Jun 9, 2019, 3:49 PM IST

జంగారెడ్డిగూడెంలో రోయింగ్​ ఆటకు శిక్షణ

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ జలాశయంలో రోయింగ్​ ఆటకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా ఇలాంటి పోటీలు నిర్వహిస్తుంటారు. ఏడాది నుంచి ఇక్కడ శిక్షణ నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శిక్షణ ఇస్తూ వారిని నిష్ణాతులుగా తయారు చేస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు రాష్ట్రస్థాయిలో జరిగిన పలు పోటీల్లో రాణిస్తూ పథకాలు సాధిస్తున్నారు. సింగిల్స్, డబుల్స్​తో కూడిన పోటీలు ఉంటాయి. నిరంతరాయంగా జరిగే శిక్షణ ద్వారా చాలామంది జాతీయస్థాయి కళాకారులుగా ఎదుగుతున్నారు. అదేవిధంగా వేసవి శిక్షణ కార్యక్రమం కూడా ఇక్కడ కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. జలాశయంలో నిత్యం నీరు ఉండటంతో శిక్షణకు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతుంది.

ABOUT THE AUTHOR

...view details