గురువారం విడుదలైన పాలిసెట్ ఫలితాల్లో తిరుమల పాఠశాల విద్యార్థులు 1, 3, 7, 11, 15 ర్యాంకులతో పాటు వందలోపు 18 ర్యాంకులు సాధించినట్లు సతీష్ బాబు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా తిరుమల పాఠశాల పాలిసెట్ మొదటి ర్యాంకును మూడుసార్లు సాధించిందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ..వారి విజయానికి బాటలు వేశారని అభినందించారు.
వరుసగా మూడోసారి పాలిసెట్ మొదటి ర్యాంకు సాధించిన తిరుమల పాఠశాల - తిరుమల విద్యాసంస్థలు
పాలిసెట్ ఫలితాల్లో వరుసగా మూడోసారి రాష్ట్ర మొదటి ర్యాంకును రాజమహేంద్రవరానికి చెందిన తిరుమల పాఠశాల కైవసం చేసుకుందని ఆ సంస్థ డైరెక్టర్ సతీష్ బాబు తెలిపారు. విద్యార్థులు విశేష ప్రతిభ చూపారని ఆయన అన్నారు.
పాలిసెట్ మొదటి ర్యాంకు సాధించిన తిరుమల పాఠశాల