ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన వ్యాన్​... ఇద్దరు మృతి - ap accidents 2019

తూర్పుగోదావరి జిల్లాలోని జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంతో అదుపు తప్పిన డీసీఎం వ్యాను.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టగా జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన వ్యాన్​... ఇద్దరు మృతి

By

Published : Jul 1, 2019, 4:58 AM IST



తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వద్ద జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కలవచర్ల కూడలిలో వెళ్తోన్న ద్విచక్రవాహనాన్ని..వేగంతో అదుపుతప్పిన డీసీఎం వ్యాను ఢీ కొట్టింది. ఈ ఘటనలో పడాల శ్రీనివాస్​రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా... కర్రీ మధుసూదన్​ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ప్రమాదం తర్వాత వ్యాన్​ను ఆపకుండా డ్రైవర్​ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో మురారి వద్ద డివైడర్​ను ఢీకొట్టి... ఆ వాహనం ఆగిపోయింది. చోదకుడిని అదుపులోకి తీసుకుని..కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ సురేశ్​ బాబు తెలిపారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన వ్యాన్​... ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details