తెదేపా ఎంపీ టీజీ వెంటటేష్ పార్లమెంటు సమావేశాలను కేంద్రం వృథా చేసిందని తెదేపా ఎంపీ టీజీ వెంకటేష్ విమర్శించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రధాని మోదీ దుర్వినియోగం చేశారని అన్నారు. ప్రజల ఆశలను ప్రధాని మోదీ వమ్ముచేశారని వ్యాఖ్యానించారు. మోదీ ఎంత తక్కువ సమయంలో ఎదిగారో అంతే సమయంలో దిగజారారని అన్నారు. నియంతృత్వ పోకడలే ఇందుకు కారణమని చెప్పారు. ప్రధానితో రాజకీయ యుద్ధం చేస్తామని స్పష్టం చేశారు. భాజపా వ్యతిరేక శక్తులను చంద్రబాబు ఒక్కతాటిపైకి తెస్తున్నారని తెలిపారు.