ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

జమ్మూలో కర్ఫ్యూ - పుల్వామా

పుల్వామా ఉగ్రదాడితో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో జమ్మూ నగరంలో కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం.

జమ్మూలో కర్ఫ్యూ

By

Published : Feb 15, 2019, 5:18 PM IST

పుల్వామా ఉగ్రదాడితో చెలరేగిన నిరసనలు హింసాయుతం అయ్యే అవకాశం ఉన్నందున జమ్మూ నగరంలో కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. శాంతి భద్రతలు అదుపులో ఉంచడానికి ప్రజలు సహకరించాలని సైన్యం విజ్ఞప్తి చేసింది.

" ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జమ్మూలో కర్ఫ్యూ విధించాం." - రమేష్​ కుమార్​, డిప్యూటీ కమిషనర్,​ జమ్మూ.

పాకిస్థాన్​కు వ్యతిరేకంగా నిరసనలు

పుల్వామా ఘటన నేపథ్యంలో పాకిస్థాన్​కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. జువెల్​ చౌక్​, పురాని మండి, రెహరి, శక్తినగర్​, పక్క డంగా, జనిపుర్​, గాంధీనగర్ ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. నిరసనకారులు రాళ్లు విసరటం వల్ల గుజ్జార్​ ప్రాంతంలో వాహనాలు ధ్వంసమయ్యాయి. పాకిస్థాన్​, తీవ్రవాద వ్యతిరేక నినాదాలు చేస్తూ రోడ్లపై టైర్లను కాల్చారు నిరసనకారులు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.

కాన్వాయ్​ల రాకపోకలు బంద్

పుల్వామా ఉగ్రదాడితో కశ్మీర్​ లోయలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని రక్షణ దళాల వాహనశ్రేణి రాకపోకలను నిలిపివేశారు అధికారులు.

ABOUT THE AUTHOR

...view details